భారీ వర్షాలకు పరవళ్ళు తొక్కుతున్న కిన్నెరసాని
మూడు గ్రామాలకు రాకపోకలు బంద్
కిన్నెరసానిపై హై లెవెల్ వంతెన నిర్మించాలని గ్రామస్తుల వినతి*
*మన్యం న్యూస్ గుండాలగత మూడు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షానికి మండలంలోని వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కిన్నెరసాని వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. గొడవటంచ గ్రామ సమీపంలో ఉన్న బ్రిడ్జి పైనుంచి కిన్నెరసాని వాగు ప్రవహించడంతో మూడు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. కోడవటంచ, పాలగుడం, నాగారం గ్రామాలకు తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతి సంవత్సరం కిన్నెరసాని వచ్చినప్పుడల్లా ఇలాంటి సమస్య ఎదురవుతుందని కిన్నెరసాన్ని వాగుపై హై లెవెల్ వంతెన నిర్మించి గ్రామస్తుల సమస్యను తీర్చాలని గ్రామాల ప్రజలు విన్నవించుకుంటున్నారు
*హై లెవెల్ వంతెన నిర్మిస్తే తప్ప సమస్య పరిష్కారం
కాదు పరిషిక రవి
కిన్నెరసాని వాగుపై హై లెవెల్ వంతెన నిర్మిస్తే తప్ప మూడు గ్రామాల సమస్య పరిష్కారం కాదని కొడవటం గ్రామానికి చెందిన పరిషిక రవి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి హై లెవెల్ వంతెనను మంజూరు చేయాలని కోరారు