- హాట్సాఫ్ నవీన్ బాబు…
- అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండాలి
- సామాజిక కార్యకర్త నవీన్ బాబు
- వర్షానికి నేలకొరిగిన ఇల్లు – కుటుంబానికి ఆర్థిక సాయం
మన్యం న్యూస్, పినపాక:
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాత రెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోగల చింతల బయ్యారం గ్రామంలో పొనగంటి ముత్తయ్య పూరి ఇల్లు పూర్తిగా కూలిపోయిన విషయం తెలిసిందే.ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త నవీన్ బాబు వెంటనే స్పందించారు.బాధిత కుటుంబానికి 10 వేల రూపాయల నగదు తో పాటు 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు.దీనితోపాటు ఇల్లు నిర్మించుకోవడానికి రేకులు, స్తంభాలు వెంటనే అందచేస్తామని తెలియజేశారు. మానవత్వం చాటుకున్న నవీన్ బాబును పలువురు అభినందించారు.బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని నవీన్ బాబు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పొనగంటి రామకృష్ణ, కురుకూరు శ్రీనివాసరావు, సతీష్, సమ్మయ్య, కిషోర్,పొనగంటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.