మన్యం న్యూస్,ఇల్లందు ఇల్లందు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సహజ వనరులను గిరిజనేతరులు దోచుకుంటున్న తీరును నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలో భారీర్యాలీ నిర్వహించనున్నట్లు యాక్షన్ కమిటీ కన్వీనర్ ఈసం నరసింహారావు దొర తెలిపారు. ఈ మేరకు ఇల్లందు వ్యవసాయ మార్కెట్లో బుధవారం జరిగిన ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో ఈసం నరసింహారావు మాట్లాడుతూ.. ఇల్లందు పట్టణంలో ఈనెల 23న జరిగే భారీర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అందుకు సంబంధించిన కరపత్రాలను నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదివాసి గ్రామాల నుంచిఆదివాసిప్రజలు ప్రతిగ్రామంనుంచి వందమంది చొప్పున రావాలని అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, ఉపాధ్యాయ, ఉద్యోగసంఘాల నాయకులు, విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అధికార, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కొందరు గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా సంపాదిస్తున్న భూములను కాపాడుకోవడానికి రాజకీయ స్వలాభం కోసం కులాలమధ్య చిచ్చుపెట్టే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలను గిరిజన, గిరిజనేతరులు అందరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణ లక్ష్మయ్య, జేఏసీ కోకన్వీనర్ వట్టం కన్నయ్య, జేఏసీ కోకన్వీనర్ మీసాల రామచంద్రు, జేఏసీ కోకన్వీనర్ చింతా ఉపేందర్, ఆదివాసి నాయకులు సువర్ణపాక శ్రీకాంత్, ధనసరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
