మన్యం న్యూస్ ఏటూరు నాగారం
గత మూడు రోజులగా ఎగవ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ఉప్పొంగడంతో గోదావరి క్రమేపి పెరుగుతుంది. మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తుంది. బుధవారం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు గోదావరిలో కలవడంతో రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద సాయంత్రం ఆరు గంటల సమయంలో 13.070 మీటర్ల వేగంతో ఉధృతంగా ప్రవహిస్తుంది.రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద గోదావరి వాటర్ లెవెల్ మొదటి ప్రమాద హెచ్చరిక 14.830 మీటర్ల వద్ద, రెండో ప్రమాద హెచ్చరిక 15.830 మీటర్ల వద్ద,17.360 మీటర్ల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
