మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలంలోని తాలిపేరు వరద ఉధృతినీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తాలిపేరు హైలెవల్ వంతెన వద్ద స్వయంగా పరిశీలించారు. ఎగువ ప్రాంతం నుంచి ఎంత వరద వస్తుంది అనే దానిపై ఇరిగేషన్ శాఖకు చెందిన వెంకటేశ్వర రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో గోదారి పరిహార ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత సబ్బంపేట లోతట్టు గ్రామాల ప్రాంతాలను పరిశీలించారు.
