భారీ వర్షాలు నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్, మణుగూరు : మణుగూరు మండలంలో పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పర్యటించి విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు, అలాగే వాగులు వంకలు డ్రైనేజ్ కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వాటిని పరిశీలించడం జరిగింది, వర్షాలు మరో రెండు మూడు రోజులపాటు కొనసాగే అవకాశం నేపథ్యంలో ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఇందుకు సంబంధించి వర్షాలు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు వర్ష ప్రభావిత అన్ని గ్రామాలు పట్టణాల నుంచి ఎప్పటికప్పుడు నివేదిక తెపించుకొని పరిస్థితి చర్యలు తీసుకోవాలని చెప్పారు, కల్వర్టులు బ్రిడ్జ్ లకు సంబంధించిన ప్రాంతాల పైన ప్రధాన దృష్టి సారించి హెచ్చరిక సూచనలు ఏర్పాటు చేయాలి, స్థానికంగా ఉన్న పోలీస్ సాగునీటి విద్యుత్ మరియు రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు,