మన్యం న్యూస్ దుమ్మగూడెం జులై 19::
విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పెరుగుతూ ఉన్నందున గోదావరి లోతట్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సూచించారు. మండలంలోని సున్నం బట్టి గ్రామంలోని గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి పెరిగే అవకాశం ఉందన్న అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సున్నం బట్టి గ్రామం వరదతో రాకపోకలు నిలిచిపోవడంతో పరిశీలించిన కలెక్టర్ వెంటనే గ్రామస్తులందరినీ పునరావస కేంద్రాలకు తరలించాలని మండల అధికారులను ఆదేశించారు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సూచనలు అందించాలని అధికారులకు తెలియజేశారు. రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో విస్తరణ వర్షాలు కురుస్తాయి కాబట్టి గోదావరి పెరిగే అవకాశం ఉన్నందున మండల యంత్రాంగం అందరూ అందుబాటులో ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎవరు కూడా వాగులు వంకలకు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తాసిల్దార్ మణిదీప్ ఎంపీడీవో ముత్యాలరావు ఏవో నవీన్ కుమార్ ఇరిగేషన్ అధికారులు రాంప్రసాద్ రాజసుహస్ స్థానిక సర్పంచ్ లక్ష్మి ఆర్ ఐ ఆదినారాయణ లక్ష్మయ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
