మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని కామేపల్లి మండలం బర్లగూడెం గ్రామంకు చెందిన మూడు సంగీత ఇటీవల ప్రమాదవశాత్తు కరెంటుషాక్కు గురై మృతిచెందడంతో గురువారంనాడు వారిఇంటికి వెళ్లి ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్ నాయక్ పరామర్శించడం జరిగింది. సంగీత చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారికుటుంబాన్ని ఓదార్చి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.