- నేనున్నానని… మీకేం కాదని.. ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుంది
- శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది.*
- గోదావరి వరద నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న రేగా కాంతారావు.
- అధికార యంత్రాంగం 24 గంటలు అప్రమత్తమై ఉండాలి.*
- వరద బాధిత ప్రజలకు నాయకులు చేదోదు,వాదోడు కావాలి.
- అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూములకు ఫోన్ చేయండి.*… ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ బూర్గంపహడ్:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మరియు భద్రాచలం లోని లోతట్టు పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అక్కడి పరిస్థితులను అక్కడి నాయకులను అడిగి తెలుసుకున్నారు.బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం సమీప గోమ్మూరు వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది.ప్రజలు ఎవరు అధైర్య పడొద్దు అని రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి ఉంటుంది అని ఇట్టి సమస్య పై శాశ్వత పరిష్కారం కోసం మన ముఖ్య మంత్రి వర్యులకు కొద్దీ రోజుల క్రితమే విన్నపించడం జరిగింది అని,శాశ్వత పరిష్కారమై మందు అడుగులు వేస్తూ తోరలోనే ప్రజలకు గోదావరి కష్టాల నుండి విముక్తి కలిగిస్తామని అన్నారు.బూర్గంపహడ్ తో పాటు భద్రాచలంలోనీ స్నాన ఘట్టాల ప్రదేశాలు,కరకట్ట ప్రదేశం,నీటితో మునిగిన ఆలయ ప్రాంగణంనీ భద్రాచలం ఏఎస్పి మరియు ప్రజా ప్రతినిధులు,నాయకులతో కలిసి పరైలించారు.జిల్లాలో అధికార యంత్రాంగం 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలను కంటికి రెప్పోలే కాపాడుకోవాలి అని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ వారికి మెరుగైన ప్రదేశాలలో పునరావాసం కల్పించాలి అని ఆదేశించారు.లోతట్టు ప్రాంత ప్రజలకు పార్టీ నాయకులు చేదోడు,వాదోడు కావాలి అని ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరం అయితే ప్రత్యేక వాహనాలు పెట్టీ వారి సామగ్రిని తరలించి అక్కడ ఉంటున్న సంబంధిత వరద బాధితుల యోగ క్షేమాలు చూసుకోవాలని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూంలకు ఫోన్ చేయాలి అని సంబధిత అధికారులు నిత్యం మీ సేవలోనే నిమగ్నమై ఉంటారు అని తెలిపారు.అధికారులు ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సమన్వయంతో పనిచేయాలని సూచించారు లోతట్టు ప్రాంతాల వారిని గుర్తించాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని,గోదావరి పరివాహక ప్రాంతాలలో వరద ఏమాత్రం పెరిగిన ముందుగా లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలించే విధంగా చూడాలి అని తెలిపారు.అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని,ముంపు ప్రాంత ప్రజలను తరలించే సమయంలో అన్ని సదుపాయాలు కల్పించడంతో దృష్టి సారించాలని పేర్కొన్నారు,కాలువలు,చెరువులు,కుంటలు చెక్ డ్యాంల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.రెవెన్యూ,పంచాయతీ,ఇరిగేషన్,విద్యుత్ శాఖ,పోలీస్ శాఖ,ఆరోగ్యశాఖ అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో రేగాతో పాటు భద్రాద్రి జిల్లా ముఖ్య నాయకులు కామిరెడ్డి రామ కొండారెడ్డి,పిఎసిఏఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,మండల యూత్ ప్రసిడెంట్ గోనెల నాని,ఇరవెండి మాజీ ఎంపీటీసీ సభ్యులు వల్లూరుపల్లి వంశీకృష్ణ,నాగినేని ప్రోలు రెడ్డి పాలెం సర్పంచ్ భుఖ్య దివ్యశ్రీ,బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కొనకంచి శ్రీనివాస్,సోషల్ మీడియా నియోజకవర్గ వర్కింగ్ యూత్ ప్రసిడెంట్ చల్లకొటి పూర్ణ,సారపక యూత్ ప్రసిడెంట్ చైతన్య రెడ్డి మరియు బూర్గంపహడ్,భద్రాచలం మండల,టౌన్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పలువురు ప్రజలు పాల్గొన్నారు.