UPDATES  

 మేము మనుషులమే… గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, ర్యాలీ నిర్వహించిన న్యూడెమోక్రసీ 

మన్యం న్యూస్ చర్ల:
గ్రామ పంచాయతీ రంగం లో పని చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా జె ఏ సి ఆద్వర్యం లో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరవధిక సమ్మె లో భాగంగా15 వ రోజు మండల కేంద్రం లో సమ్మె శిబిరం వద్ద కార్మికులకు మద్దతు గా ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 50 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికుల కృషి ఫలితంగా దేశం లో గ్రామ పంచాయతీ రంగం లో రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక అవార్డ్స్ గెలుచుకుంటుంన్నదని,అటువంటి కార్మికులను పర్మినెంట్ చేయకుండా,వేతనాలు పెంచకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు.
గడిచిన ఐదు సంవత్సరాల కాలం లో రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచకపోగా,జీఓ నంబర్ 51 మల్టీ పర్పస్ విధానం తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చారని అన్నారు.అవగాహన,సామర్ధ్యం లేని పనులను,విద్యార్హత ను బట్టి నియామకం అయిన కారోబార్,బిల్ కలక్టర్ లని సైతం అన్ని క్యాటగిరిల పనులును చేయిస్తున్నారని విమర్శించారు.ఈ విధానం వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేసారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు కి అనుగుణంగా బేసిక్ వేతనం 19 వేలు కానీ,జీఓ 60 ప్రకారం మున్సిపల్ కార్మికులు ఇచ్చే వేతనాలు కానీ,కనీస వేతనం రూ 26 వేలు కానీ ఏదో ఒకటి అమలు చేయాలని డిమాండ్ చేశారు.పని చేస్తూ ప్రమాదం లో మరణించిన కార్మికుడికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్,పెన్షన్ సౌకర్యం కల్పించాలని,ప్రమాద భీమా సౌకర్యం కార్మికులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పారిశుధ్య కార్మికులనీ దేవుళ్లతో పోల్చిన ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ పేరుతో నిధులను దుర్వినియోగం చేస్తున్నారని,కార్మిక చట్టాలను మార్చి లేబర్ కోడ్ లను తెచ్చికార్మిక హక్కులను పాతరేస్తున్నారని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్స్ ను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఉద్యోగులు,కార్మిక సంఘాలు, సతీష్, కిషోర్,బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !