మన్యం న్యూస్ గుండాల, ఆళ్లపల్లి: వర్షాలు ఉధృతంగా కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఆళ్లపల్లి ఎస్సై రతీష్ ప్రజలకు సూచించారు. గురువారం మండలం పరిధిలోని జల్లేరు వాగు, కిన్నెరసాని వాగుల వద్దకు వెళ్లి వాటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ప్రజలు ఉధృతంగా ప్రవహించే దాట వద్దని సూచించారు గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు వాగుల వల్ల ఇబ్బందిలు గురి అయ్యేటట్టు ఉంటే వాగు ఇవతల ఉన్న వారి బంధువుల వద్ద వాగు ఉధృతి తగ్గేంత వరకు ఉండాలని సూచించారు. తడిగా ఉన్న కరెంటు స్తంభాలను తాకరాదని ఆయన అన్నారు. ఉదృతంగా ప్రవహించే వాగులను దాటవద్దని వాటి వద్దకు చిన్న పిల్లలని పంపవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకట్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి, కానిస్టేబుల్ శ్రీనివాస్, ఉపేందర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
