మన్యం న్యూస్ వాజేడు
కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంగా ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో గోదావరి వరదలు ఉప్పొంగటంతో పేరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల రహదారులు వరద నీటిలో మునిగిపోగా, రాబోయే గోదావరి వరదల గురించి నీట మునిగే అవకాశం ఉన్న గ్రామాలను, వరదల ఉదృతిని ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఏటూరునాగారం ఏ ఎస్ పి సిరిశెట్టి సంకీర్త్ సందర్శించారు. గోదావరి వరదలు పెరుగుతున్నందున తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు గురించి వివరించటం జరిగింది. వీరితో పాటు పేరూర్ ఎస్.ఐ హరీష్, పాల్గొన్నారు.