మన్యం న్యూస్ బూర్గంపహడ్:-రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుంచి దంచి కొడుతున్న వర్షాలు,ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల వరదలతో,గోదావరి లో కలుస్తున్న వందల పిల్ల కాలువలు,పదుల సంఖ్యలో వాగులు,వంకలు ఈ క్రమంలో కొత్తనిటికి బూర్గంపహడ్ మండల కేంద్ర (ముదిరాజ్) మత్స్యకారులకు క్వింటన్నర పైగా పట్టుబడ్డ చేపలు,రెండు చేపలు 10 కిలోల చొప్పున ఉండగా మిగిలిన చేపలు 2 కిలోల నుండి 10 కిలోల మధ్య ఉన్నాయి ఇగ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు ఈ గోదావరి చేపలు తినడానికి గుంపులు గుంపులుగా ఎగబడి మరి కొనుగోలు చేశారు.కేవలం ఐదుగురు మత్స్యకారులు మాత్రమే ఇన్ని చేపలు పట్టడం విశేషంగా ప్రజలు భావిస్తున్నారు.ఇన్ని చేపలు ముదిరాజ్ మత్స్యకారులకు పడడంతో వారి యువ నాయకులు తోకల సతీష్,గుండె వెంకన్న ఆనందం వ్యక్తం చేశారు.