మన్యం న్యూస్ వాజేడు
గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి, గోదావరి నది సైతం ఉప్పొంగి ప్రవహిస్తుంది.గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజల కు ప్రమాద హెచ్చరికలు మ్రోగిస్తున్నయి.తెలంగాణ రాష్ట్రం చివరి సరిహద్దు అయిన, ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న నది ని కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు.గోదావరి నది ముంపు గ్రామాలను గుర్తించి ప్రజలను త్వరితగతిన పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎటువంటి ఆస్తి నష్టం కాని ప్రాణ నష్టం కానీ జరగకుండా సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పేరూరు, పీహెచ్సీ తనిఖీ
కలెక్టర్ పర్యటనలో భాగంగా పేరూరు పీహెచ్సీని తనిఖీ చేశారు. అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉండాలని, సిస్టర్స్, ఫార్మసిస్, ల్యాబ్ అసిస్టెంట్, కొరత లేకుండా చూడాలని డాక్టర్ రహీల్ కు సూచించారు. ప్రధానంగా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రజలకు పలు రకాల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాజేడు, పేరూరు పిహెచ్సి లకు అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వాజేడు మండల ప్రత్యేక అధికారి సర్దార్ సింగ్, ఎమ్మార్వో సర్వర్ పాషా, ఎం పి ఓ శ్రీకాంత్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.