మన్యం న్యూస్: జూలూరుపాడు, జూలై 20, ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మండలంలోని కాకర్ల గ్రామనికి చెందిన షేక్ అఫ్జల్ సాహెబ్ రేకుల ఇల్లు కూలిపోయింది. దింతో వారు తమ ఆశ్రయాన్ని కోల్పోయారు. గత మూడు రోజులుగా కురిసిన వర్షం కారణంగా రేకుల ఇల్లు కూలిపోయిందని ఆఫ్జల్ దంపతులు బాధపడుతున్నారు. ఆఫ్జల్ భార్య ఖాతీజ వికలాంగురాలు వారు రోజువారీ కూలిపనులకు వెళ్ళి జీవనం సాగిస్తున్నారు. ఆశ్రయం కోల్పోయిన తమను దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు.