మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై, 20: ఈనెల 24వ తేదీన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో ఇల్లందులో జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి కొలికపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. అశ్వారావుపేటలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను సాధించడానికి మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని, మాదిగ విద్యార్థులు ఉద్యోగులు, మహిళలు ఉద్యమంలో విస్తృతంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ ద్వారానే మాదిగ, మాదిగ ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందని వారన్నారు. బిజెపి పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి అధికారం వచ్చిన 9 సంవత్సరాలు అయినప్పటికీ ఎస్సీ వర్గీకరణ చేయకుండా తాత్సారం చేస్తుందని విమర్శించారు. ఈనెల 24న ఇల్లందులో జరిగే జిల్లా సదస్సుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కోలేటి పకీరయ్య, కొలిక పోగు కాంతారావు, గాలంకి వినోద్, నార్లపాటి సత్యం, నార్లపాటి శరత్ బాబు, రావూరి వీరయ్య, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.