UPDATES  

 ఎంపీడీఓ కార్యాలయం లో బిఎల్ఓ ట్రయినింగ్ కార్యక్రమం లో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్

మంగపేట మండల ఎంపీడీఓ కార్యలయం నందు శుక్రవారం (21.07.2023) బి ఎల్ ఓ లకు 2వ ఎస్ ఎస్ ఆర్ 2023 పై ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి మలుగు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ . ఇలా త్రిపాఠి హాజరై కచ్చితమైన ఓటరు జాబితా తయారు చేయడం లో బి ఎల్ ఓ లది కీలకమైన పాత్ర అని, ఈ సంవత్సరం లో తెలంగాణా రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కావునా 2వ ఎస్ ఎస్ ఆర్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో బాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి ఎల్ ఓ అండ్ బి ఎల్ ఓ,సూపర్వైజర్స్ క్షేత్ర స్థాయి లో హౌస్ టూ హౌస్ సర్వే, ఫామ్-6, 7,8 ల నిర్వహణ ఎలా చేస్తున్నారో వారితో ముఖా ముఖి చర్చించి వివరాలు తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయి లో వారి పని విధానం , ఫామ్ ల నిర్వహణ పై పలు రకాల ప్రశ్నలు అడగడం జరిగింది. ఎన్నికల కు సంబంధించిన దస్త్రాలను పరిశీలించి సలహాలు , పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమం లో ఈ ఆర్వో, ఆర్డీఓ,ములుగు శ్రీ సత్యపాల్ రెడ్డి, ఏ ఈ ఆర్వో,తహసీల్దార్ మంగపేట, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ తుల రవి, ఇంఛార్జి ఎంపీడీఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !