UPDATES  

 మణిపూర్ లో ఘటనకు పాల్పడ్డ బాధ్యులను కఠినంగా శిక్షించాలి 🔹 మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పద్మజ

మణిపూర్ లో ఘటనకు పాల్పడ్డ బాధ్యులను కఠినంగా శిక్షించాలి
🔹 మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పద్మజ

పాల్వంచ : మణిపూర్ లో మహిళలపై గడిచిన రెండు నెలలుగా జరుగుతున్న సంఘటనలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని ఈ ఘటనలు మాయని మచ్చగా ఉన్నాయని భారత జాతీయ మహిళా సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీసంశెట్టి పద్మజ అన్నారు. స్థానిక సీఆర్ భవన్ నందు శుక్రవారం జరిగిన సమాఖ్య ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మణిపూర్ కు చెందిన ఇద్దరూ ఆదివాసి మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక దాడి జరపడం అమానసమని అభివర్ణించారు ఈ ఘటనకు పాల్పడిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని పద్మజ డిమాండ్ చేశారు మణిపూర్ లో జరుగుతున్న దారుణ మారణ ఖండను నిలవరించడంలో ఆ రాష్ట్రబీజేపీ ప్రభుత్వం తో పాటు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కూడా పూర్తిగా విఫలం చెందాయని మండిపడ్డారు ఈ ఘటనలు పరిశీలన చేయడానికి భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనిరాజాతో పాటు మహిళా సమాఖ్య నాయకురాలను ఆ రాష్ట్ర సర్కార్ పోలీసులతో అరెస్టు చేయడం ఏయా మైన చర్యని అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని దేశవ్యాప్తంగా రోజూ ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై చిన్నారులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. సమావేశంలో కూడలి సంఘమిత్ర భద్రమ్మ మేరమ్మ పద్మ హేమలత కమటం ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !