UPDATES  

 దేశంలో అత్యాచారం ఎక్కడ జరిగిన అక్కడ అణగారిన వర్గాల గిరిజన తెగలు మాత్రమే బలి.. ఆదివాసి సేన కోకన్వీనర్ రమేష్

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం జులై 21::
దేశంలో ఎక్కడ అత్యాచారాలు జరిగిన అణగారిన వర్గాల చెందిన గిరిజన తెగలు మాత్రమే బలి అవుతారని భద్రాద్రి ఆదివాసి సేన కో కన్వీనర్ కారం రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో కుకీ గిరిజన తెగకు చెందిన ఇద్దరు గిరిజన మహిళలు గిరిజనేత్రులు వ్యవస్థను చూపి ఊరేగింపుగా తీసుకెళ్లి మానభంగం చేయడం భారత మహిళా లోకానికి చెరగని మచ్చని దేశంలో అణగారిన వర్గాలైన గిరిజన తెగలకు చెందిన మహిళలను దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక మూలన మానభంగాలు హత్యలు దాడులు జరుగుతున్న కనీసం ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని గిరిజనులకు ఒక న్యాయం అని రమేష్ మండిపడ్డారు. అదే అగ్రకులాలు వారైతే ప్రభుత్వం స్పందించి వెంటనే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటుందని కానీ ఆదివాసి జాతి వారు అయితే సంఘటన జరిగి ఇన్ని రోజులైనా పట్టింపు లేదని ఎద్దేవా చేశారు. ఈ ఘటనపై దేశ న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా ఖండించడంతో నేరస్తులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !