మన్యం న్యూస్ దుమ్ముగూడెం జులై 21::
ఆదివాసులు తమ హక్కులను పరిరక్షించేందుకు సాంస్కృతిక పునర్జీవనం వారి యొక్క భాష ఎంతో కీలకమని ఆదివాసి సంక్షేమ పరిషత్ కన్వీనర్ రేసు ఆదినారాయణమూర్తి అన్నారు. మండలంలోని కొత్తపెళ్లి గ్రామంలో విశ్వ కోయ గోండి భాషా దినోత్సవం యువజన నాయకులు కల్లూరి విర్రాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీలోని పిల్లలు పెద్దలు పాల్గొని కోయ భాష యొక్క ప్రాముఖ్యతని తెలియపరిచారు. ఈ సందర్భంగా ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఆదివాసులు వారి భాషలను మరవరాదని దేశంలో ఏడు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల పైగా కోయ భాష మాట్లాడే వారు ఉన్నారని దీన్ని జాతీయ భాషగా గుర్తించాలని అన్నారు. తను గతంలో ఉపాధ్యాయుల రాత పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన ఐటీడీఏ పీవో తనను మౌలిక పరీక్షల్లో భాగంగా కోయ జాతి గోత్రాలను తెలపమని అన్నారని, తను కోయ జాతి గోత్రాలు చెప్పలేక ఉద్యోగం కోల్పోయిన సందర్భాన్ని గుర్తు చేశారు. అనంతరం గోండ్వానా సంక్షేపరిషత్ ఉపాధ్యక్షులు వీరభద్రం మాట్లాడుతూ మాతృభాష అంతరించిపోతే ఆదివాసి జాతికే ముప్పు ఏర్పడుతుందని సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోతాయని ఆదివాసి జాతిని జాతి సంఘాలను గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామచంద్రయ్య ఆదివాసి నాయకులు కల్లూరి ప్రసాద్ ముత్తయ్య వీరభద్రం ముద్రరాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.