పట్టుబట్టి యాడాదిలోపే వంతెన నిర్మాణం పూర్తి
గతంలో ఐదు పంచాయతీలకు కొద్ది రోజులు నిలిచిన రవాణా
సమస్య విన్న వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ రేగా
మండలంలో రేగా అభివృద్ధి మార్క్ అంటున్న ప్రజలు
మన్యం న్యూస్ గుండాల: గత ఏడాది సమస్యతో ప్రయాణం నేడు సులభతరం. ఆళ్లపల్లి మండలం కేంద్రం నుండి మర్కోడు వెళ్లే మార్గమధ్యలో రాఘవాపురం సమీపంలో అలుగు వర్రె గత సంవత్సరం జూలై 22వ తారీఖున భారీ వర్షాల వల్ల వరద ఉధృతికి రోడ్డు పూర్తిగా తగ్గిపోయింది. దీని కారణంతో ఐదు పంచాయతీలకు కొద్ది రోజులు పూర్తిగా రవాణా స్తంభించింది రాత్రి నిద్రకు వచ్చిన ఆర్టీసీ బస్సు సైతం కొద్ది రోజులు రహదారి లేకపోవడంతో ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు నిత్యవసర వస్తువులు అత్యవసరం అయితే అంబులెన్స్ సైతం ఈ దారి గుండా వెళ్లలేక నాన్న ఇబ్బందులు పడ్డాయి. అలాంటిది సమస్య విన్న ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఏడాది తక్షణమే రూ.60లక్షల రూపాయలను మంజూరు చేసి వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే అధికారులు స్పందించి టెండర్ పిలిచి వెంటనే చక, చక పనులను ప్రారంభించారు .ఏడాది తిరిగేలోపే వంతెన పూర్తయి జూలై 20వ తారీకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సమస్య ఉన్న వెంటనే అక్కడికి వచ్చి పరిష్కరించే అంత పెద్ద మనసు ప్రస్తుత రాజకీయ నాయకులలో కొరవడిందని కానీ దానికి భిన్నంగా పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వ్యవహరిస్తూ అభివృద్ధిలో రేగా మార్క్ మండలంలో చూపుతున్నారని మండల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆళ్లపల్లి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పూర్తిచేసిన రేగా కాంతారావు ఇంకా తనదైన శైలిలో దూసుకుపోతూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ప్రగతి పదంలో నిలుపుతున్న ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అభివృద్ధికి ప్రత్యేక సంకేతమై నిలిచారని అందుకు నియోజకవర్గ ప్రజలు ఆయనకు బాసటగా నిలవడం మన అందరి బాధ్యత అంటూ పలువురు మండల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు
