మన్యం న్యూస్ దుమ్ముగూడెం జులై 21::
గృహలక్ష్మి పథకం ఇండ్లు మంజూరు చేయాలని టీఏజీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా మూడు లక్షల రూపాయలు కేటాయిస్తామని తెలియజేసిన ఇంతవరకు దానికి సంబంధించిన షెడ్యూలు విడుదల చేయలేదని గృహలక్ష్మి పథకాన్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండలంలో పోడుపట్టాలు రాని వారికి రెండో విడత పట్టాలు వచ్చే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని సంబంధిత రెవెన్యూ అధికారి నరసింహారావు కి వినతిపత్రం అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పై అధికారులు దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చంద్రయ్య మండల అధ్యక్షులు సత్యనారాయణ నాగలక్ష్మి వెంకటేష్ సావిత్రి నాగమణి తదితరులు పాల్గొన్నారు.