మన్యం న్యూస్ గుండాల…మణిపూర్ లో ఆదివాసి మహిళలను నగ్నంగా ఊరేగించి హత్య చేసిన దుండగులను నరి రోడ్డుపై ఉరితీయాలంటూ అన్ని పార్టీల ఆదివాసి నాయకులు మండల కేంద్రంలో ప్రదర్శన ధర్నా నిర్వహించారు. తుడుం దెబ్బ, ఆదివాసి సంక్షేమ పరిషత్, కాంగ్రెస్, తెలుగుదేశం, న్యూ డెమోక్రసీ, ప్రజాపంథా, పార్టీల నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఆదివాసి నాయకులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఆదివాసీలపై అక్కడి మహిళలపై దాడులు జరుగుతున్న అక్కడి ప్రభుత్వం స్పందించకుండా వ్యవహరిస్తుందని అన్నారు. అక్కడి మహిళలను నగ్నంగా బజారులో తిప్పి హత్య చేసినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిందితులను శిక్షించడంలో విఫలమవుతున్నాయని అన్నారు. తక్షణమే దాడులను ధమన కాండం చల్లార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ సీతారాములు, ఎంపీటీసీ కృష్ణారావు, వాగబోయిన చంద్రయ్య దొర, కోడెం వెంకటేశ్వర్లు, ఈసం పాపారావు, ముత్తయ్య, తోలెం సాంబయ్య, పూనెం శ్రీను, తదితరులు పాల్గొన్నారు
