విధులను చాలెంజిగా తీసుకోండి .. మంత్రి పువ్వాడ
గోదావరి వరదలను సమర్థంగా ఎదుర్కోవాలి
పూర్తిగా తగ్గే వరకు అధికారులెవరూ విశ్రమించొద్దు.
లోతట్టు బాధితులను పునరావాస కేంద్రాలకు తక్షణమే తరలించాలి
▪వారికి భోజనం, వైద్యం, త్రాగునీరు, వసతి ఏర్పాటు చేయాలి.
▪అధికారులు, సిబ్బంది గతం కంటే ఇంకా అప్రమత్తంగా ఉండాలి..
▪ప్రాణ నష్టం, అస్తి నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు సమన్వయం చేయాలి.
*▪జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
గోదావరి వరదల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరదల నేపథ్యంలో మంత్రి పువ్వాడ శుక్రవారం భద్రాచలం బ్రిడ్జి పై నుండి వరద ఉదృతి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకొని కేటాయించిన ఆయా శాఖ అధికారులు ఒక విధులను చాలెంజ్గా తీసుకొని ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రజలను ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ప్రభవిత గ్రామాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. ఎలాంటి ప్రాణ నష్టం గానీ ఆస్నష్టం గానీ కలగకుండా చూసే బాధ్యత ఆయన శాఖల అధికారులపైనే ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు గోదావరి వరదలు వరకు మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన పునరావాస కేంద్రాలను ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అలా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ సాయి మనోహర్ అడిషనల్ ఎస్పీ విజయబాబు భద్రాచలం ఎస్ పి పరితోష్ పంకజ్ మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు, పాల్వంచ సీఐ వినయ్ కుమార్ ,సిఐ నాగరాజు రెడ్డి, ఎస్పీ ఇన్స్పెక్టర్ నాగరాజు, వర్మ ,తదితరులు పాల్గొన్నారు