- మంత్రి పువ్వాడ కు సీఎం కేసీఆర్ గారి ఫోన్..
- ▪గోదావరి వరద ఉధృతి పై మంత్రిని అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్
- అర్ధరాత్రి వరకు వరద సమీక్షించాలి
- మంత్రి పువ్వాడకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
- వరదలు తగ్గే వరకు అందుబాటులో ఉంటా.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హామీ
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి ఆయా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్ కి ఫోన్ చేసి పరిస్థితిని వాకోబు చేశారు.
వరద ప్రవాహ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, అర్థ రాత్రిళ్లు సైతం పరిస్థితిని సమీక్షించాలని సీఎం కేసీఆర్ రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఆదేశించారు.
*భద్రాచలం లో గోదావరి వరద తగ్గే వరకు ఇక్కడ ఉంటామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు…