మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
గోదావరి వరద ముంపు ప్రాంతాల ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండాలని మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచిం చారు . శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోభద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు గోదావరి నది వరదమొంపు ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.ముందుగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతిని పరిశీలించడానికి వచ్చిన ఐజీ గారిని జిల్లా ఎస్పీ వినీత్ స్వాగతం పలికారు.అనంతరం గోదావరి బ్రిడ్జి పై నుంచి వరద ఉధృతిని పరిశీలించారు.తర్వాత భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ప్రజలకు అండగా ఉండాలని తెలియజేసారు.ప్రజలు కూడా అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్,అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ సాయి మనోహర్,ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు,భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ ఐపీఎస్,పాల్వంచ డిఎస్పి వెంకటేష్,మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు,పాల్వంచ సిఐ వినయ్ కుమార్,భద్రాచలం సిఐ నాగరాజు రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు,రాజు వర్మ తదితరులు పాల్గొన్నారు.