మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం భారతీయ భారతీయ జనతా పార్టీ చర్ల మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి నక్క కన్నా రావు, ఆలం సమ్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బందు ప్రకటించి రెండు నెలలు కావస్తున్న పట్టుమని 100 కుటుంబాలకు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు ఇంతే కాకుండా ఈ బీసీ లోన్లలో కొంతమంది అధికారులు అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకొని అధికారులను ఒత్తిడి చేస్తూ ఈ లక్ష రూపాయల లోన్లను తమ పార్టీకి సంబంధించిన వాళ్లకే అందేలా చూడాలని పైరవీరులు చేస్తున్నారని అనుమానాలకు తావితీస్తుంది. దీనిని దయచేసి పార్టీలకు అతీతంగా బీసీ కులాలకు న్యాయం చేకూర్చాలంటే అర్హులైన ప్రతి బీసీ కులస్తులకు ఈ పథకము అందేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చూడాలని చర్ల మండల భారతీయ జనతా పార్టీ మండల కమిటీ డిమాండ్ చేస్తున్నది.
