మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న మధుసూదన్‌రాజును స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అల శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా అదనపు బాధ్యతలు చేపట్టిన జి మధుసూదన్ రాజు శనివారం జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అల కు విధులకు రిపోర్ట్ చేశారు. మధుసూదన్ రాజు జడ్పి సీఈఓగా అదనపు బాధ్యతలతో డిఆర్డీఓ గా పని చేసారు. తేది 25.6.2020 నుండి పూర్తిస్థాయి అధికారిగా ప్రభుత్వం జిల్లాగ్రామీణాభివృద్ధి శాఖ అధికారిగా పదవీ బాధ్యతలు అప్పగించింది. జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటంతో జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అల డిఆర్డీఓ మధుసూదన్ రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
శనివారం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బాద్యతలు చేపట్టిన మధుసూదన్‌రాజు జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు.