మన్యం న్యూస్: జూలూరుపాడు, జులై 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పోలీస్ శాఖలో జిల్లా వ్యాప్తంగా జరిగిన సబ్ ఇన్ స్పెక్టర్ ల బదిలీలలో భాగంగా మణుగూరు ఎస్సైగా పనిచేస్తున్న బి పురుషోత్తం జూలూరుపాడు సబ్ ఇన్ స్పెక్టర్ గా బదిలీపై రానున్నారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్సై పోటు గణేష్ కొత్తగూడెం సిసిఎస్ కు బదిలీ అయ్యారు.