మన్యం న్యూస్ బూర్గంపహడ్:- బూర్గంపహడ్ మండల పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ సి.హెచ్.జాన్సన్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీనీ నిర్వహించారు.మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న మారణ హోమం స్త్రీలపై చేసిన నగ్న ప్రదర్శనలు ఆపై అత్యాచారాలు,ఆపై హత్యలను ముక్తకంఠంతో ఖండించారు.ఈ నేరాలు చేసిన దోషులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని మనిపూర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మణిపూర్లో శాంతి సామరస్యాలు యధావిధిగా పునరుద్ధరించబడాలి,అందుకొరకై ప్రభుత్వాలు స్పందించి శాంతి కొరకు పాటుపడాలని శాంతియుత ర్యాలీనీ చేపట్టారు.ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రెసిడెంట్ జాన్సన్ ,జాయింట్ సెక్రెటరీ జాన్ మార్క్,ట్రెజరర్ టీవీ ఆర్ మోడీ,పాస్టర్ రాఘవులు,వి.వేణుకుమార్,ఇంకా తదితర పాస్టర్లు సంఘ సభ్యులు పాల్గొన్నారు.