మన్యం న్యూస్ దుమ్మగూడెం జులై 22::
తెలంగాణ సాహితీయోధుడు పద్య రచన కావ్య పితామహుడు దశరధి కృష్ణమాచార్య 98వ జయంతిని లక్ష్మీ నగరం బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ సాంస్కృతిక కళాకారుల ప్రచార కార్యదర్శి పిలక నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కట్ చేస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ సాహిత్యానికి ఎనలేని కృషి చేస్తూ ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న నినాదంతో నిజాం కాలం నాటి నిరంకుశ పాలనపై ఉక్కు పదం మోపి కవితలతో తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్ని ధారలుగా మలిచి తెలంగాణ ఏర్పాటు కోసం ఎనలేని కృషి చేస్తూ ఆయన రచించిన చైతన్య స్ఫూర్తి దశరధి అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అలాంటి మహానుభావులు అడుగుజాడల్లోనే మనమందరం కొనసాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, అధికార ప్రతినిధి ఎండీ జానీ పాషా, సహాయ కార్యదర్శి కెల్లా శేఖర్, యూత్ అధ్యక్ష కార్యదర్శులు అల్లాడి వెంకటేష్, గంగరాజు, అనిల్, డేగల రవి, జంగిటి రాము, శ్రీను తదితరులు పాల్గొన్నారు.