మన్యం న్యూస్ వాజేడు. మండలంలో బొల్లారం, మురుమూరు కాలనీ, గ్రామాలలో డాక్టర్ జ్ఞానస ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో రోగాలు బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయిన బాధిత కుటుంబాలు ఉన్నాయి. గ్రామాలలో ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కోరారు . బొల్లారం గ్రామంలో 42 మంది ఆరోగ్య శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. 9 మంది గర్భవతులు, బాలింతల నలుగురు, మధుమేహం ఆరుగురు, రక్తపోటు 14 మంది. జ్వరం వచ్చిన పేషెంట్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది కోటిరెడ్డి, రాజేశ్వరి, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
