మన్యం న్యూస్ దుమ్ముగూడెం జులై 22::
మణిపూర్ రాష్ట్రంలో గిరిజన తెగలకు చెందిన మహిళలపై సామూహిక దాడి చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తూ లక్ష్మీ నగరం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ బిజెపి పాలిత మణిపూర్ రాష్ట్రంలో మతోన్మాదం ముసుగులో గిరిజన మహిళలపై సామూహిక దాడి చేసి యావత్ ప్రపంచం సిగ్గుతో తలదించుకునేలా వివ్యస్థ చూపి ఊరేగింపు చేయడం భారతమాత తల్లికి అవమానకరమని ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయం తీసుకోవాలని ఈ విధమైన ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మి, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాముడు, అధికార ప్రతినిధి జానీ పాషా, ఆదివాసి సీనియర్ నాయకుడు టిడిపి మండల అధ్యక్షులు దామోదర్ రావు, ఏఎస్పి డివిజన్ అధ్యక్షులు మల్లు దొర, సిపిఐ నాయకులు రామిరెడ్డి, రమేష్, ప్రజాపంద నాయకులు సాయన్న, మహిళా నాయకులు రాజేశ్వరి, వెంకటరమణ, యూత్ నాయకులు వెంకటేష్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.