మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై, 22: రాజ్యసభ సభ్యులు, హెటిరో సంస్థ అధినేత డాక్టర్ బండి పార్థ సారథి రెడ్డి ఆలోచన మేరకు గ్రామీణ నిరుద్యోగ యువత జీవితాల్లో భవిష్యత్తు పై బరోస కలిగించే ధ్యేయంగా అశ్వారావుపేట ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు హెటిరో సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం 24 తేదీ నా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరుకు మెగా జాబ్ మేళ జరుగుతుందని ఈ జాబు మేళ వి కే డివిఎస్ డిగ్రీ కళాశాల వేదికగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మెచ్చా ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు. ఇట్టి అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని, యువతీ, యువకులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్ లు, వెంట తీసుకొని రావాల్సిందిగా ఎమ్మెల్యే మెచ్చా విజ్ఞప్తి చేశారు.