- మతోన్మాద ముసుగులో అరాచకాలను సహించం
- మణిపూర్ కిరాతకులను కఠిణంగా శిక్షించాలి.
- మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి కుమారి
- మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కల్లకు గంతలు కట్టుకొని నిరసన
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
: మతోన్మాధ ముసుగులో మహిళలపై, దళిత, గిరిజనులపై జరుగుతున్న ఆరాచకాలను సహించబోమని, కేంద్రంలోని మోడీ కిరాతకులను, ఉన్మాదులను పెంచి పోషిస్తూ మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నాడని సిపిఐ అనుబంద భారత జాతీయ మహిళా సమాఖ్య భద్రాది జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి అన్నారు. మణిపూర్ ఘటనను నిరసిస్తూ సమాఖ్య ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. బస్టాండ్ సెంటర్ లోని అమరవీరుల స్థూపం వద్ద కల్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి కుమారి మాట్లాడుతూ మణిపూర్లో రెండు నెలలుగా గిరిజన తెగకు చెందిన మహిళలపై అత్యాచారాలు, హత్యలు, హింసాత్మక సంఘటరలు జరుగుతున్నా మోడీకీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరెన్ సింగ్కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. కుకి తెగకు చెందిన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం దేశానికే సిగ్గుచేటని, ఈ ఘటన జరిగి నెలన్నర గడుస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోరుమెదపకుండా ఆరాచక శక్తులకు మతోన్మాద దాడులకు ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. బేటీ పడావో.. బేటి బచావో అంటూ ఊదరగొట్టే ప్రధానికి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ దుచ్చర్యను భారత సమాజం ముక్తకంఠంతో ఖండించాలని, దోషులకు కఠిణ శిక్షలు అమలయ్యేవరకు బిజెపి పెద్దలను అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా నాయకులు కరిష రత్నకుమారి, మామిడాల ధనలక్ష్మి, షాహీన్, సత్తెనపల్లి విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, పోలమూరి ధనలక్ష్మి, మద్దెల విజయలక్ష్మి, షమీమ్, కుంటి పుష్ప, లావణ్య, రాజేశ్వరి,శారద, దనమ్మ తదితరులు పాల్గొన్నారు.