మన్యం న్యూస్ గుండాల: మండలం పరిధిలోని కాచినపల్లి రేంజ్ పరిధిలోగల జగ్గు తండ గ్రామంలో కాచనపల్లి రేంజర్ దీపిక, కొమరారం రేంజ్ శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మూడు లక్షల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిలువ ఉంచిన వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమంగా కలపను నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తప్పవని కాచనపల్లి రేంజర్ పేర్కొన్నారు