UPDATES  

 చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట బందోబస్తును నిర్వహించండి గంజాయి మత్తు పదార్థాలు అరికట్టండి మల్టీ జోన్ 1.. ఐజి చంద్రశేఖర్ రెడ్డి

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతిని పరిశీలిస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోవిస్తృతంగా పర్యటించారు.ముందుగా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న కిన్నెరసాని బ్రిడ్జి వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించారు.అనంతరం రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.బూర్గంపాడు,అశ్వాపురం,మణుగూరు,ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లను సందర్శించి ఆయా ప్రాంతాల స్థితిగతుల గురించి జిల్లా ఎస్పీ వినీత్.జి ఐపిఎస్ గారిని అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ఉన్న ప్రవేశ మార్గాలను,జిల్లా నుండి బయటకు వెళ్లే మార్గాల గురించి తెలుసుకుని,అట్టి మార్గాలలో పకడ్బందీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టి గంజాయి లాంటి మత్తు పదార్థాల రవాణాను అరికట్టడంలో బాధ్యతగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో భాగంగానే అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద గోదావరి నది వరద ఉధృతిని పరిశీలించి,అక్కడ అధికారులను ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది క్రమంగా పెరిగే అవకాశం ఉందని, కావున లోతట్టు ప్రాంతాలు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారిన వాగులు,వంకల వద్ద పోలీసు అధికారులు నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ తో పాటు పాల్వంచ డిఎస్పీ వెంకటేష్,మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు,ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు,రాజు వర్మ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !