మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
వెంకటాపురం మండల కేంద్రంలో మూడు గంటల సమయంలో శివాలయం శివారులో కొందరు వ్యక్తులు ప్రభుత్వా నిషేధిత సిపిఐ మావోయిస్టు వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ సెక్రటరీ సుధాకర్ పేరు చెప్తూ ఇసుక కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు సీఐ శివప్రసాద్ మరియు ఎస్ఐ తిరుపతిరావు, వారి సిబ్బందితో కలిసి వెంకటాపురం గ్రామ శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఒక బ్యాగ్ తో అనుమానస్పదంగా కనిపించి నట్టు సీఐ శివప్రసాద్ తెలిపారు, పోలీస్ పార్టీని చూసి పారిపోవడానికి ప్రయత్నించరని అతికష్టం మీదవారి వద్ద ఉన్న బ్యాగు ని చెక్ చేయగా అందులో పదివేల రూపాయల నగదు మరియు రెండు బొమ్మ తుపాకులు ఉన్నాయని వారు తెలిపారు. వెంటనే వారిని, ఆధీనంలో తీసుకొని విచారింపగా నిందితులు వారి వివరాలు ఇలా తెలిపారు.
తాటి సురేష్ సన్నాఫ్ వెంకటేష్ వయస్సు 28 సంవత్సరాలు వృత్తి కార్ డ్రైవర్. ఊరు మంగవాయి.
ముండ మంగులు సన్నాఫ్ మాలు వయసు 28 సంవత్సరాలు కులం ఎస్టి కోయ వృత్తి కూలి జారున ఖర్కేలి బీజాపూర్ డిస్ట్రిక్ట్ చతిస్గడ్.
గోట రాజేష్ సన్నాఫ్ డోంగా వయసు 25 సంవత్సరాలు ఎస్ టి కోయ వృత్తి. కూలీ ఊరు బీజాపూర్ చత్తీస్గడ్. అని పోలీస్ విచారణలో వెల్లడి చేసినట్టుగా సిఐ శివప్రసాద్ తెలిపారు.
గత కొంతకాలం నుంచి మావోయిస్టుల పేరుతో ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్లను బొమ్మ తుపాకులతో బెదిరించి డబ్బులను వసూలు చేస్తున్నారని అలాగే ఇసుక ర్యాంప్ కాంట్రాక్టర్ అయినా రమణారెడ్డి నుండి పదివేల రూపాయల నగదు వసూలు చేసినట్టుగా నిందితులు తెలిపినారు. వీరి దగ్గర నుండి బొమ్మ తుపాకులు 2.సెల్ ఫోన్లు మూడు.మరియు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్టుగా సీఐ శివ ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా ఈ ఘటన వెనుక ఎలాంటి నక్సల్స్ ప్రమేయం లేదని వారు పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా ఈ మండలంలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని అలా ఎవరైనా పాల్పడితే చట్ట పరమైనచర్యలు తీసుకుంటామని సీఐ శివ ప్రసాద్ తెలిపారు.
