మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం పోలీస్ స్టేషన్ ఆవరణలోని నూతనంగా నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ డాక్టర్ వినోద్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి గదులు జైలవములను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించి మట్టి పోసి మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాత పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించవద్దని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. పోలీస్ స్టేషన్ను సందర్శించే పిటీషన్ దారుని మర్యాదపూర్వకంగా పలకరిస్తూ ఇరు వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా లోతైన విశ్లేషణతో వివరణ ఇవ్వాలని అన్నారు ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు, ఎడుళ్ల బయ్యారం సిఐ బూర.రాజగోపాల్ గౌడ్, మణుగూరు సిఐ.ముత్యం. రమేష్,కరకగూడెం ఎస్ఐ రాజారామ్,ఉన్నత అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.