మన్యంన్యూస్ నూగుర్ వెంకటాపురం :
గత కొంతకాలంగా గ్రామపంచాయతీ కార్మికులు వారి వారి జీతభత్యాల గురించి సమ్మె చేస్తున్న విషయం విధితమే, ఈ నేపథ్యంలో రోజుకొక విధంగా ప్రభుత్వ దృష్టికి వారి డిమాండ్లను వ్యక్తపరిచే క్రమం కొత్త వరువడికి తావిని ఇస్తున్నాయి. ఈరోజు మండలంలో పారిశుధ్య కార్మికులు సిఐటియు అధ్యక్షుడు కట్ల నరసింహ చారి నేతృత్వంలో ఉదయం దుర్గమ్మ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు బిక్షాటన చేశారు. తమ పైన ప్రభుత్వం ఏమాత్రం పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్న రని ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. భిక్షాటనలో భాగంగా దండోరా తో వారి గోడు తెలంగాణ ప్రభుత్వానికి వినిపించేలా విస్తృతంగా వారి గళాన్ని వినిపించారు. అంతేకాకుండా ప్రతి కొట్టుకు తిరిగి బిగ్షాట్న చేస్తూ వారి సమ్మెను వినూత్నంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మరియు 18 గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.