మన్యంన్యూస్ ఇల్లందురూరల్: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇల్లందు మండల పరిధిలోని మామిడి గుండాల గ్రామపంచాయతీ మేడికుంట వాగు పొంగి పొర్లి మేడికుంట నుండి రామచంద్రాపురం రహదారి పూర్తిగా దెబ్బతిని రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరిప్రియ స్థలానికి చేరుకొని మరమ్మత్తులు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రతీ వర్షాకాలంలో పునరావృతమవుతున్న సమస్య అయినందున రహదారికి సంబంధించి శాశ్వత పరిష్కార నిర్మాణ పనులను గురించి సెక్రటేరియట్ లో ఫైల్ సమర్పించడం జరిగిందని, అతి కొద్దిరోజుల్లోనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే హరిప్రియ గ్రామస్తులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంజ కృష్ణ, శీలం రమేష్, ఘాజి, సూర్నపాక ప్రభాకర్, నీలం రాజశేఖర్ , అశోక్ , హుస్సేన్, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.