UPDATES  

 ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు,విత్తనాలు విక్రయించాలి. మణుగూరు ఏడీఏ తాతారావు

మన్యం న్యూస్ కరకగూడెం: మండలంలోని పలు ఎరువుల దుకాణాలను మణుగూరు ఏడీఏ తాతారావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా రైతులకు ఎరువులు, విత్తనాలు విక్రయించినా, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసగించినా వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేయడంతోపాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.అంతేకాకుండా దుకాణాల్లోని విత్తన ప్యాకెట్లపై కంపెనీ పేరు, గడువు తేదీ,స్టాక్‌ రిజిస్టర్‌, బిల్‌ బుక్కులను పరిశీలించారు.వ్యాపారులు విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించారు.రైతులు ఎట్టి పరిస్థితిలో రసీదులు లేకుండా ఎరువులు కొనకూడదని కోరారు.అలాగే రసీదుల్లో రాసిన ధరలే దుకాణాల్లోని ధరల పట్టికలో ఉండాలని చెప్పారు. దుకాణాదారులు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే తమ దృష్టికి ఎవరైనా తీసుకురావచ్చు అని పిలుపునిచ్చారు.తనిఖీల్లో ఏఓ చటర్జీ ఏఈఓలు ప్రశాంత్,అనిల్ కుమార్ పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !