UPDATES  

 మణిపూర్ లో హింసకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.

మణిపూర్ లో హింసకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.
మన్యం న్యూస్ కరకగూడెం:మణిపూర్ లో హింసకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పలువురు ఆదివాసీ నాయకులు,యువత డిమాండ్ చేసారు. ఈ మేరకు వారు శనివారం మండల కేంద్రంలో మణిపూర్ లో కుకి మహిళలను వివస్త్రతను చేసి లైంగిక దాడి జరిపి,వారిని నగ్నంగా ఊరేగించి అత్యాచారాన్ని చేసి హత్య చేసిన ఇద్దరిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్టంలో చెలరేగుతున్న హింసను నివారించి శాంతియుత , సాధారణ పరిస్థితిలు నెలకొనేలా చర్యలు చేపట్టాలని కోరారు . మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితిని అదుపు చేయడంలో బీజేపీ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు.మణిపూర్ పరిస్థితిలపై వ్యాఖ్యానించడానికి , స్పందించడానికి కూడా దేశ ప్రధానికి ఇన్ని రోజులు సమయం పట్టిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ముఖ్యమంత్రి బీరన్ సింగ్ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించారు . దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న ఈ సమస్యను పరిష్కరించడానికి
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఏమాత్రం తాత్సారం చేసిన ఈ పరిణామాలదుష్ప్రభావం మిగతా రాష్ట్రాల పై పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !