మన్యం న్యూస్ గుండాల: బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఎంతో ప్రాముఖ్యతనిస్తుందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మణుగూరు మండలం గుట్ట మల్లారం వెంకటేశ్వర్ల స్వామి ఆలయం నందు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఆర్యవైశ్యుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అన్నారు ఆర్యవైశ్యుల సంక్షేమ భవనానికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది అన్నారు మొదటి వితడ లో 50 లక్షల నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు మిగతా నిధులు కూడా త్వరలోనే మంజూరు అవుతాయని ఆయన అన్నారు, అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్యవైశ్యుల సంక్షేమానికి రాజకీయంగా సామాజికంగా న్యాయం చేస్తున్నారు అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు,ఆర్యవైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు సామాజిక సేవలోను ముందు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు టిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు
