UPDATES  

 చెవిలో పువ్వు చేతిలో కర్ర చిప్పతో నిరసన తెలిపిన గ్రామ పంచాయతీ జేఏసీ కార్మికులు

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై, 23: అశ్వారావుపేట గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 18వ రోజుకు చేరింది. రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా ఈ నిరసన కార్యక్రమం గ్రామపంచా యతీ కార్మికులు అంతా కలసి స్థానిక రింగ్ రోడ్డు కూడలిలో చెవిలో పువ్వు, చేతిలో కర్ర, చిప్పతో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ పాలకులు తమకు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా కార్మికుల జీవితాలతో చెలగాటం లాడు కుంటున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల స్పందించి చర్చలకు పిలవాలని ఆయన కోరారు. జరుగుతున్న సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అనంతరం గ్రామపంచాయతీ జేఏసీ కార్మికుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నాయకులు యూసఫ్ కిషోర్ లు పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలిపినారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి వెంకటప్పయ్య, కేసుపాక నరసింహారావు, గౌరవాధ్యక్షులు మట్లకుంట కామేశ్వరరావు, మూల అప్పన్న, మండల ట్రెజరర్ వేల్పుల ముత్తారావు, మండలకమిటీ సభ్యులు మురళి, ఆరేపల్లి, నాగేంద్రరావు, కట్ట శీను, రంజిత్ సింగ్, బాణాల వరలక్ష్మి, అల్లాడి ధనమ్మ, బద్దే లక్ష్మి, పద్మ, జ్యోతి, రాణి, శ్యామ్, రమాదేవి, స్వప్న రాధాకృష్ణ, ఇంద్ర, రాణి నాగమణి, మరియమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !