మన్యం న్యూస్ బూర్గంపహడ్:- స్థానిక రూపా స్కూల్,భద్రాచలం నందు ఐటిసి బిఆర్టియు కార్మిక సంఘం అధ్యక్షులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్టియు కార్మిక సంఘం అధ్యక్షులుగా మరియు తెలంగాణ రాష్ట్ర మినిమం వైఎస్ బోర్డు సభ్యులుగా అదే విధంగా అతి చిన్న వయస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకమైన శ్రమశక్తి అవార్డు అందుకున్న నాయకుడు మరియు రోటరీ క్లబ్ సభ్యులు అయిన సానికొమ్ము శంకర్రెడ్డిని భద్రాచలం రోటరీ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమహాలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో వసంతరావు,మునికేశవరావు,బ్రహ్మరెడ్డి,యశోద రాంబాబు,ప్రభాకర్ గుప్తా,మధు,నాగేశ్వరరావు,బాలాజీరావు,పలివెల రవికుమార్,అజీమ్,సాగర్,వరలక్ష్మి,రమేష్,శ్రీధర్రెడ్డి,చలపతి,శ్రీనివాస్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.