మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
రోడ్లపై నడిచే నడిచే పాదచర్లను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కే నరేష్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐల బదిలీలో భాగంగా పాల్వంచ ఎస్సై విధులు నిర్వహిస్తున్న కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐగా నియమించబడ్డారు ఈ మేరకు ఆదివారం కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జనాభా పెరుగుతున్న దృష్ట్ ట్రాఫిక్ నియమ నిబంధనలు పోలీస్ శాఖ కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని అన్నారు పోలీసు నియమ నిబంధనలు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని పోలీస్ శాఖ తరపున చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు.