మన్యం న్యూస్ (భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి):
సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న 14 జేఈ(ఈ అండ్ ఎం) పోస్ట్ లను అంతర్గత అభ్యర్ధులతో భర్తీ చేసేదానిలో భాగంగా ఆదివారం సింగరేణి మహిళా డిగ్రీ పీజి కళాశాలలో వ్రాత పరీక్ష నిర్వహించటం జరిగింది. పరీక్షకు అర్హులైన 10 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ వ్రాత పరీక్ష సెక్యూరిటీ విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణలో సిసి కెమెరాల నిఘా మధ్య నిర్వహించటం జరిగింది. ఈ పరీక్ష జిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ ఆర్సి కె.బసవయ్య పర్యవేక్షణలో జరిగింది. ఈ పరీక్ష పూర్తిగా మెరిట్ పై ఆధారపడి ఉంటుందని దళారులకు ఎలాంటి ప్రమేయం ఉండదని వారిని నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించారు. ఈ పరీక్ష ఫలితాలు సింగరేణి వెబ్ సైట్ సింగరేణి ప్రధాన కార్యాలయ ముఖద్వారం వద్ద నోటీస్ బోర్డుద్వారా తెలియజేయటం జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణ పరీశీలనలో డిజిఎం విజిలెన్స్ విఎన్విఎస్ఆర్ శాస్త్రి, డిజిఎం పర్సనల్ ధన్ పాల్ శ్రీనివాస్, పి.వేణు గోపాల రావు, ఎస్ఓ టు జిఎంసెక్యూరిటీ జే.వేణుమాధవ్, డివై.పిఎం నాగేశ్వర రావు, సీనియర్ పిఓ కే.సంతోష్ కుమార్, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శారద, ఇతర అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.