– రానున్న రోజుల్లో మరింత మందికి ట్రై సైకిల్స్
– జి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గడాల
– డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణి
మన్యం న్యూస్(భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి):
వికలాంగుల సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గడాల విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జిఎస్ఆర్ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని జనహిత కార్యాలయం ఆవరణలో 10 మంది వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణి చేసారు.
అనంతరం గడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలోని మండలాల వారీగా 10 మంది వికలాంగులను ఎంపిక చేసి వారికి ట్రై సైకిళ్లను అందించడం జరిగిందన్నారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేయడంతో వారి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఇంకా ఎవరికైనా అవసరం ఉన్న వారికి అందిస్తామని తెలిపారు.
కొత్తగూడెం పరిసర ప్రాంతంలో డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా విద్య ఆరోగ్యం ఉపాధి ఉజ్వల భవిష్యత్తు అనే నినాదంతో ప్రారంభించిన ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవ సామజిక కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.