మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
పర్యావరణ పరిరక్షణ తీసుకున్న కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ కొత్తగూడెం మిలీనియం 320 ఈ క్లబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో
సోమవారం బాబు క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీవో జిల్లా అధ్యక్షుడు జోన్ చైర్మన్ లయన్ సంగం వెంకట పుల్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం ఈనెల 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. పాఠశాల ప్రధనోపాధ్యాయురాలు బూరుగు మధురవాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రీజినల్ ఛైర్మన్ లయన్ గబ్బేట రాజన్న, ప్రోగ్రాం చైర్మన్ లయన్ కూర శ్రీధర్, లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్ష కార్యదర్శులు లయన్ షేక్ దస్తగిరి, లయన్ లగడపాటి రమేశ్, ప్రోగ్రాం మిలీనియం అధ్యక్ష కార్యదర్శులు లయన్ గుత్తుల శ్రీనివాస్, లయన్ సక్రు లయన్ వనితా, పాఠశాల విద్యార్ధులు ఉపాద్యాయులు పాల్గొన్నారు.
